అశ్వారావుపేట, జూన్ 1 : ఆయిల్‌పాం రైతులకు ఆయిల్‌ఫెడ్ ఈ నెల కూడా శుభవార్త తెలిపింది. పెరిగిన ఆయిల్‌పాం గెలల ధరను బుధవారం హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో అధికారులు వెల్లడించారు. జూన్ నెలకు గాను టన్ను ధర రూ.23,467గా ప్రకటించారు. గత నెలలో టన్ను ధర రూ.22,842లు ఉండగా ఈ నెల టన్నుకు రూ.625లు పెరిగింది. పెరిగిన ధర జూన్‌లో ఫ్యాక్టరీకి తరలించే గెలలకు మాత్రమే వర్తిస్తుందని ఆయిల్‌ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ టీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆయిల్‌ఫెడ్ చరిత్రలోనే ఈ సారి రికార్డు ధర నమోదు కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.