Asara Pensions | శాయంపేట నవంబర్ 27: లబ్ధిదారులు చనిపోయినప్పటికీ వారిని తొలగించకుండా ఆసరా పింఛన్ల పంపిణీలో గో ల్మాల్ చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేటలో అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. గ్రామ పం చాయతీలోని పెన్షన్ల రికార్డులు, పంపిణీ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించగా లోపా లు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. శాయంపేట జీపీలో వేలిముద్రలు రాని 106 మంది వృద్ధులకు పంచాయతీ కా ర్యదర్శి రత్నాకర్ ద్వారా ప్రతినెలా పింఛ న్లు పంపిణీ చేయిస్తున్నారు.
సదరు కార్యదర్శి కేవలం పేరు మాత్రమే రాసుకొని పింఛన్లు ఇచ్చినట్టు బుధవా రం రాష్ట్ర సెర్ప్ డైరెక్టర్ గోపాల్రావు, పింఛన్ల పంపిణీ జిల్లా అధికారి స్వామి చేసిన తనిఖీల్లో గుర్తించారు. బయోమెట్రిక్, అక్విటెన్స్ లే కుండా ఎన్ని పింఛన్లు పంపిణీ చేశారు? అవి నిజంగా లబ్ధిదారులకు చేరాయా? లేక దుర్వినియోగమయ్యాయా? అనే అనుమానంతో పింఛన్లకు సంబంధించిన అన్ని రికార్డులను అధికారులు పరిశీలించారు.