రఘునాథపాలెం : ఖమ్మం నగర పరిధిలోని గొల్లగూడెం ప్రాథమిక పాఠశాల పశువుల కొట్టంగా మారింది. ఆదివారం, సోమవారం పాఠశాలలకు సెలవులు రావడంతో పక్కనే నివాసం ఉండే ఓ పాడి రైతు తన పశువులను ఈ స్కూలు ప్రాంగణంలోని చెట్ల కింద కట్టేశాడు.
బడి పిల్లలు ఉండే పాఠశాల ప్రాంగణంలో పశువులు దర్శనమిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేటుకు తాళం వేయకపోవడంతోనే పశువులను కట్టేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.