హైదరాబాద్ : రాయదుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మూడేళ్లలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఆర్థిక సేవల కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో ప్రస్తుతం 250 మంది ఉద్యోగులు ఉన్నారు. 2021 చివరి నాటికి 800 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. 2023 నాటికి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధి గుంజన్ సమతాని తెలిపారు.
Mr. Gunjan Samtani, Head of @GoldmanSachs Services in India, Mr. Sonjoy Chatterjee, Chairman and CEO of @GoldmanSachs in India, Mr. Clark Ledger, Acting Consul General & Consular Chief @USAndHyderabad and Mr. @jayesh_ranjan, Prl. Secy, ITE&C Dept graced the occasion.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 19, 2021