వేములవాడ టౌన్ : ఎస్ఎస్ఎస్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత, హిందూ మజ్దూర్ ట్రేడ్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కానుగంటి రాజు వేములవాడ రాజన్నకు మంగళవారం బంగారు రుద్రాక్ష మాలను బహూకరించారు. నేపాల్ నుంచి తీసుకొచ్చిన రుద్రాక్షలతో 90 గ్రాముల బంగారు రుద్రాక్షమాలను తయారు చేయించి అందజేశారు.