శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టివేత
శంషాబాద్, సెప్టెంబర్ 3: వేసుకున్న దుస్తుల్లో రూ.43.55 లక్షల విలువైన కిలో బంగారాన్ని పేస్టు రూపంలో దాచి అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ శుక్రవారం కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న విమానం నుంచి సైఫుల్ మహ్మద్ రఫీక్ అనే ప్రయాణికుడు దిగాడు. అతనిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. వేసుకున్న దుస్తుల్లో పేస్టు రూపంలో ఉన్న కిలో బంగారాన్ని దాచినట్టు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.