హైదరాబాద్, మే 5(నమస్తే తెలంగాణ): పర్యావరణ అనుకూల ఆరోగ్య సేవలే తమ లక్ష్యమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. జూన్ 20న హైటెక్‌సిటీలోని యశోద దవాఖానలో నిర్వహించనున్న ‘హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్’ అంతర్జాతీయ సదస్సు బ్రోచర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సదస్సులో ఆరోగ్య వ్యవస్థలో అమలు చేసే మార్గాలపై చర్చలు జరుగుతాయని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషిచేసిన సంస్థలకు ‘హెచ్ఈఎల్పీ’ సైస్టెనబిలిటీ ఎక్సలెన్స్ అవార్డులు అందజేస్తామని, దరఖాస్తు చేసుకునే వారు 10లోగా https://green hospitalsindia. org/help- conference-2026/వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ మార్త రమేశ్, సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.