హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాల పరిరక్షణకు 111 జీవో అమలులోకి వచ్చింది. ఈ జీవో పరిధిలోని 84 గ్రామాల్లో లక్ష ఎకరాలకు పైగా భూముల్లో ప్రత్యేక ఆంక్షలు అమలవుతున్నాయి. ఉన్న విస్తీర్ణంలో కేవలం పది శాతం మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి, మిగతా దాని లో సాగు సంబంధిత కార్యకలాపాలు మాత్ర మే చేయాలి.
అందుకే చెంతనే హైదరాబాద్ నగరంలో ఆకాశహర్మ్యాలు వెలిసినా ఆ లక్ష ఎకరాలకు పైగా భూముల్లో మాత్రం ఏమీ చే యలేని పరిస్థితి ఉండటంతో భూముల విలువ కూడా పెద్దగా పెరగలేదు. అంటే రైతుల త్యాగా ల మీద జంట జలాశయాల పరిరక్షణ కొనసాగుతుంది. కానీ ప్రభుత్వ, అధికార యంత్రాంగాల నిర్లక్ష్యం పుణ్యాన ఏకంగా ఎఫ్టీఎల్ పరిధుల్లోనే భారీ నిర్మాణాలు వెలియడంతో ఆ రైతుల త్యాగాలకు సార్ధకత కూడా లేకుండాపోయింది.