Brahmotsavam | ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Brahmotsavams | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండోరోజు బుధవరాం ధ్వజారోహణం( Dwajarohanam) శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా యజ్ఞాచార్యులు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు , ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం , పారాయాణికుల మధ్య కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది.
వేద స్వరూపుడైన గరుత్మంతుని చిత్రపటాన్ని ధ్వజస్థంభానికి అలంకరించి సకల దేవకోటిని, ప్రాణకోటిని వేంచేయమని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, ఉప కార్యనిర్వహణాధికారి , సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు , భక్తులు పాల్గొన్నారు. సాయంతం ఆలయంలో నిత్యారాధనలు, భేరిపూజ, దేవతాఆ్వనం, హవనము లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఉచిత వైద్య శిబిరం
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు వంశీకృష్ణ, హరీశ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించారు. కొండపైన ఉన్న బస్టాండ్, కొండకింద ఉన్న కల్యాణ కట్ట వద్ద శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

