హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తె లంగాణ): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ వాటి ఉపకులాలకు చెందిన ఉద్యోగుల వివరాలను అందించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీచేశారు. ఇంటిగ్రేటెడ్ ఫై నాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలను అప్డేట్ చేసేందుకు కొత్త మాడ్యూల్ రూపొందించిన ట్టు తెలిపారు.
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రా జ్యాంగ ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ రిజర్వేష న్ల క్యాటగిరీలో ఉప వర్గీకరణకు ఆయా రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీ సముదాయాల ప్రా తినిధ్య నిష్పత్తి కోసం వివరాలను సేకరించాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశం మేరకు వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పో ర్టల్లో ఈ నెల 5వ తేదీలోగా పొందుపర్చాలని సుల్తానియా సూచించారు.