హైదరాబాద్, జూన్ 12, (నమస్తే తెలంగాణ): సినీ నటుడు మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు పెట్టిన కేసులో దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మోహన్‌బాబుపై ఫిర్యాదు చేసిన రంజిత్‌కుమార్‌కు రెండు రోజుల్లో నోటీసులు జారీచేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధిపై దాడి కేసులో పహాడీషరీఫ్ పోలీసులు పలు సెక్షన్లతో పాటు హత్యాయత్నం (బీఎన్ఎస్ 109) కింద కేసు పెట్టడాన్ని మోహన్‌బాబు హైకోర్టులో సవాల్ చేశారు. ఫిర్యాదిదారు రంజిత్‌కుమార్‌కు నోటీసులు పంపుతుంటే తిరిగి వచ్చేస్తున్నాయని ఆయన న్యాయవాది చెప్పారు.