హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఏటూరునాగారం సమీపంలో జరిగిన ఎన్కౌంటర్తోపాటు తదనంతరం చర్యలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పిటిషనర్ ఐలమ్మ భర్త మృతదేహాన్ని తదుపరి విచారణ వరకు భద్రపర్చాలని, మిగిలిన 6 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 5కి వాయిదా వేశారు.