హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): దుర్గం చెరువు పరిరక్షణకు చేపట్టే స్వల్పకాలిక ప్రణాళిక అమలు తీరుపై నివేదిక ఇవ్వాలంటూ నిపుణుల కమిటీని హైకోర్టు ఆదేశించింది. దుర్గం చెరువు బఫర్ జోన్‌లోని ఎన్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను ఎప్పటిలోగా తొలగిస్తారన్న దానిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మురునీటి ప్రవాహం, రసాయనాలు, చెరువు కలుషితమై చేపలు చనిపోతున్నాయంటూ వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. దీనిపై ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.