హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ):న్యాయవాదుల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లతో ఏర్పాటుచేసిన సంక్షేమ నిధికి అదనంగా, కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.100 కోట్లు జోడించాలని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. శుక్రవారం అసెంబ్లీలో న్యాయవాదుల సంక్షేమనిధి, న్యాయవాద క్లర్క్‌ల సంక్షేమనిధి చట్ట సవరణ బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లులకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. టికెట్ ఫీజును రూ.100 నుంచి రూ.250కి పెంచడం సరికాదని బీఆర్ఎస్ సభ్యుడు కాలేరు వెంకటేశ్, న్యాయవాదులకు ఇం డ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్, సం క్షేమ నిధికి రూ.200 కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యుడు మధుసూదన్‌రెడ్డి కోరారు. అనంతరం రెండు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.