కోనరావుపేట, ఆగస్టు 22: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ బాలికపై కోతులు దాడిచేశాయి. దీంతో బాలికకు స్పల్ప గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు శుక్రవారం ఉదయం కోతులు గుంపుగా వచ్చాయి.
వాటిని చూసి పిల్లలంతా పరగులు తీశారు. ఈ సమయంలో ఐదో తరగతి చదువుతున్న షేక్ రేష్మపై కోతులు దాడి చేయగా, ఉపాధ్యాయులు వచ్చి వాటిని చెదరగొట్టారు. విద్యార్థిని కోనరావుపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లి వైద్యం చేయించారు.