చింతకాని, జూలై 26 : తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుత్తు షాక్కు గురై బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరంలో శుక్రవారం చోటుచేసుకున్న ది. గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ దంపతులకు కూతురు అంజలి కార్తీక (9), కుమారుడు వెంకట గణేశ్ ఉన్నారు. శుక్రవారం ఉదయం కార్తీక తండ్రి వద్ద నుంచి సెల్ఫోన్ తీసుకున్నది. దానికి చార్జింగ్ లేకపోవడంతో తడి చేతులతో చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో కుప్పకూలింది. కొద్ది సేపటికి గమనించి వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.
చిన్నగూడూరు (మరిపెడ), జూలై 26: కుక్కకాటుకు గురై చికిత్స పొందు తూ మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జర్లలో గురువారం చోటుచేసుకున్నది. జంగం పూలమ్మ(36)ను ఈనెల 5న పిచ్చికుక్క కరవడంతో స్థానికంగా చికిత్స పొందుతున్నది. వారం రోజుల క్రితం ఆమె రేబిస్ వ్యాధిబారిన పడింది. కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది.
తాడ్వాయి, జూలై 26: ములుగు జిల్లా తాడ్వాయి మండ లం మేడారం సారల మ్మ ప్రధాన పూజారి కాక సంపత్(35) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతూ చికి త్స పొందుతున్నాడు. సంపత్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు. జాతర లో సేవలందించిన సంపత్ మరణంతో పూజారుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.