Medico Preethi | కొడకండ్ల, మార్చి 3: సీనియర్ వేధింపులతో ఇటీవల బలవంతంగా తనువు చాలించిన మెడికో విద్యార్థిని ధరావత్ ప్రీతి మరణాన్ని రాజకీయం చేయొద్దని, ప్రీతికి, ఆమె కుటుంబానికి న్యాయం చేసే విధంగా పోరాడాలని గిర్నితండా గ్రామస్థులు, సర్పంచ్ రాజ్‌కుమార్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ డిమాండ్ చేశారు.
బీజేపీ కార్యకర్త జీవితారాజశేఖర్ శుక్రవారం రాత్రి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా.. మీరు ఎంత ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు’ అని జీవితారాజశేఖర్ను నిలదీశారు. సీఎం కేసీఆర్ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంతంగా రూ.20 లక్షలు ప్రకటించారని అన్నారు.