పండరీపూర్: మహారాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయాన్నే పండరీపూర్‌కు చేరుకుని శ్రీవిఠల్ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించారు. దైవ దర్శనం కోసం సీఎం ఆలయం ఆవరణలోని దుకాణ సముదాయాల నడుమ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వృద్ధ భక్తుడు ఆయనకు విఠలేశ్వరుడు, రుక్మిణీ అమ్మవార్లతో కూడి ఉన్న ప్రతిమను బహూకరించారు. సీఎం కేసీఆర్ ఎంతో వినమ్రంగా వృద్ధుడి నుంచి ఆ ప్రతిమను స్వీకరించారు.
అంతకుముందు ఆలయ సమీపంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు వాహనం దిగి ఆలయం ఉత్తర ద్వారం దాకా నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు సీఎంను చూసేందుకు పోటీపడ్డారు. సీఎం కేసీఆర్ దారికి ఇరువైపున ఉన్న ప్రజలకు అభివాదం చూస్తూ ముందుకు కదిలారు.