హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘అర్ధాకలి అన్నపూర్ణ’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
బల్దియా చీఫ్ ఇంజినీర్ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీలో అడిషనల్ కమిషనర్లు పంకజ, వేణుగోపాల్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. శనివారం కమిటీ సభ్యులు లక్డీకాపూల్, మింట్ కాంపౌండ్ పరిసర ప్రాంతాల్లోని అన్నపూర్ణ కేంద్రాలను సందర్శించారు. వసతులు, భోజన నాణ్యతను పరిశీలించారు. త్వరలోనే మిగతా కేంద్రాలను పరిశీలించి, మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.