హైదరాబాద్ నగరంలో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి ప్రభుత్వం మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది. ముషీరాబాద్‌లో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన వీఎస్టీ కార్మిక సంఘం నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, స్వరాష్ట్రంలో తొలి హోంమంత్రిగా పనిచేశారు. ఆయన సేవలకు గుర్తుగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పేరు పెడుతున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సుమారు రూ.450 కోట్లతో నిర్మించిన పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జిని శనివా రం మున్సిపల్.శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీలో భాగంగా 2.63 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది.
– హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ