పోలింగ్ కేంద్రాలకు జీహెచ్ఎంసీ కసరత్తు
ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో కాలనీ లేదా బస్తీల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. దీన్ని పలు వార్డుల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నది. బుధవారం హైదరాబాద్‌లో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్‌రాజ్ సమావేశమయ్యారు.
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో కాలనీ లేదా బస్తీల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. దీన్ని పలు వార్డుల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నది. బుధవారం హైదరాబాద్‌లో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్‌రాజ్ సమావేశమయ్యారు. కొత్త విధానంపై పార్టీ నేతలకు జీహెచ్ఎంసీ కమిషనర్ వివరించారు. ఓట్ల జాబితా కంప్యూటీకరణపై పలు పార్టీల నేతలు తమ సందేహాలను వ్యక్తం చేశారు. సీఈవో వికాస్ రాజ్ మాట్లాడుతూ జాబితా కంప్యూటీకరణ మొత్తం కేంద్రం ఎన్నికల సంఘం చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అదే విధంగా కొత్త ఓటర్ల నమోదుపై నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే వివరాలను వారికి వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

