హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని ఆలయాలకు చెందిన 34,092 ఎకరాల భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారించామని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇందులో భాగంగా స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం విలేకరులతో మం త్రి మాట్లాడారు. ఆలయ భూములను సర్వే చేసి జియోట్యాగింగ్ చేస్తామని చెప్పారు. రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి యాదగిరి గుట్ట ఆలయ గోపురాన్ని 60కిలోల బంగారంతో తాపడం చేస్తామని వెల్లడించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా భూ సేకరణకు రూ.60 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. దేవాలయాలు, ఏకో టూరిజం ప్రాంతాలను కలుపుతూ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని వివరించారు.
‘ఇందిరమ్మ ఇండ్ల’కు సాయం చేయండి ;కేంద్రానికి మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సాయం చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేం ద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి కులదీప్ నారాయణ్ శుక్రవారం మంత్రి పొంగులేటిని సచివాలయంలో కలిశారు. మంత్రి మా ట్లాడుతూ నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నందున, తెలంగాణ సర్కారుకు సహకరించాలని కోరారు.