వరంగల్ : నాలుగు లేబర్ కోడ్లను(Four labor codes) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో (General strike) భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ పార్టీలు, అనుబంధ సంఘాలు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకవస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి నాడు పోరాడి సాధించుకున్న పాత చట్టాలనే తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏళ్ల తరబడి వస్తున్న ఉద్యోగ, కార్మిక హక్కులను అణచివేసే కుట్రలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్స్ తీసుకవస్తుందని ఆరోపించారు. ఇకనైనా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేదంటే దేశవ్యాప్తంగా కార్మికులు ప్రజలు బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
నల్లబెల్లిలో..
నర్సింహులపేటలో..
జయశంకర్ భూపాలపల్లిలో..
మొగుళ్లపల్లిలో..
హనుమకొండలో..