మణుగూరు టౌన్/పాల్వంచ, జూన్ 30 : నల్లగొండ జిల్లాలోని వైటీపీఎస్ (యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్)లోని స్టేజ్-1, స్టేజ్-2లోని యాష్‌ప్లాంట్, కోల్ప్లాంట్లను ప్రైవేటీకరించే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మం గళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్) వద్ద నిరసన తెలిపారు. బీటీపీఎస్ ప్రధాన గేటు వద్ద తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాక్ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించి ఫ్లెక్సీలతో నిరసన తెలిపా రు. వైటీపీఎస్‌లోని కోల్, యాష్ప్లాంట్లను ప్రైవేటీకరిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. పాల్వంచలోని కేటీపీఎస్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. కేటీపీఎస్ అంబేద్కర్ కర్మాగారం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జేఏసీ నాయకులు బ్యాడ్జీలు ధరించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.