టేకుమట్ల జోన్ 18 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఆలియాస్ గణేష్( చర్చల ప్రతినిధి), అలియాస్ ఉదయ్ మృతి చెందాడు. ఆయనతోపాటు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
35 సంవత్సరాల క్రితం తన అన్న సారయ్య, అలియాస్ ఆజాద్‌తో కలిసి పార్టీలో చేరాడు. కాగా, అన్నల బాటలోనే తన చిన్న తమ్ముడు అశోక్ సైతం మావోయిస్టు పార్టీలో చేరారు. అన్న ఆజాద్ ఎన్కౌంటర్లో అమృతి చెందగా తమ్ముడు అశోక్ లొంగిపోయాడు. రవి భార్య జిల్లాని మేఘం సైతం ఎన్కౌంటర్లో మృతిచెందగా.. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి మృతి చెందాడు. దీంతో వెలిశాలలోని గాజర్ల కుటుంబంలో విషాద ఛాయలు అమలు కున్నాయి.