హైదరాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్ర శివారులో ఉన్న కందూరు చోళుల కాలపు నంది విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
ఆయన ఆదివారం నంది విగ్రహంతోపాటు అకడే ఉన్న శిథిల శివాలయాన్ని పరిశీలించారు. పునాదుల వరకు ఉన్న శిథిల శివాలయం, భిన్నమైన నంది విగ్రహం 12వ శతాబ్దం లో ఈ ప్రాంతాన్ని పాలించిన కందూరు చోళుల కాలం నాటివని తెలిపారు. ఈ నంది విగ్రహాన్ని గ్రామంలోని మారండేశ్వరాలయానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు.