రేషన్ తూకంలో గింజా తగ్గదు
పౌర సరఫరాల (రేషన్) దుకాణాల్లో తూకం అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. తూకంలో గింజ కూడా తక్కువ రాకుండా చూసేలా అన్ని రేషన్ షాపులను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది.
- వెయింగ్ మిషన్లు, ఈ-పాస్ లింక్
- బియ్యం తూకం కరెక్ట్‌గా ఉంటేనే లావాదేవీ పూర్తి
- డిజిటలైజేషన్.. వచ్చే నెలలో జీహెచ్ఎంసీలో అమలు
- 17,500 దుకాణాల డిజిటలైజేషన్
- జూన్ నుంచి రాష్ట్రమంతా: గంగుల
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): పౌర సరఫరాల (రేషన్) దుకాణాల్లో తూకం అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. తూకంలో గింజ కూడా తక్కువ రాకుండా చూసేలా అన్ని రేషన్ షాపులను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ-పాస్ యంత్రాలతో వేయింగ్ మిషన్లను అనుసంధానించనున్నది. దీంతో వినియోగదారునికి ఇవ్వాల్సిన బియ్యం, ఇతర వస్తువుల తూకం సరిగా ఉంటేనే ఆ ట్రాన్సాక్షన్ పూర్తయ్యి రశీదు వస్తుంది. ఒక్క గ్రాము తక్కువగా ఉన్నా ట్రాన్సాక్షన్ నిలిచిపోతుంది. ఈ విధానాన్ని వచ్చే నెల అమలు చేయనున్నారు. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలోని 1,545 షాపుల్లో కొత్త ఈ-పాస్ మిషన్లను అందించి నూతన విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత జూన్ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా విడతలవారీగా అమలు చేస్తారు. మొత్తంగా రాష్ట్రంలోని 17,500 రేషన్ షాపుల్లో బియ్యం తూకానికి సంబంధించి నూతన విధానాన్ని అమలు చేయనున్నారు.
యంత్రాల సరఫరాకు కొత్త కంపెనీ
రేషన్ షాపుల డిజిటలైజేషన్‌పై పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ-పాస్ మిషన్ల సరఫరా, నిర్వహణకు సంబంధించి ప్రస్తుత కంపెనీ కాలపరిమితి ముగియడంతో కొత్తగా విజన్ టెక్ సంస్థను ఎంపిక చేశారు. ఈ సంస్థ అన్ని రేషన్ షాపులకు కొత్త యంత్రాలను సరఫరా చేయనున్నది. ఈ-పాస్ మిషన్లతో వేయింగ్ మిషన్ల అనుసంధానంతో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాధారణంగా తమకు సైప్లె చేసే సంచుల్లో సుమారు 2.5 కేజీల వరకు బియ్యం తక్కువగా వస్తాయని తెలిపారు. ఈ నూతన విధానం అమలు వల్ల ప్రతి షాపులో మొత్తం ట్రాన్సాక్షన్లో సుమారు 3-4 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వస్తాయని, ఈ భారం తమపై పడకుండా చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్ల సంఘం నేత మురళీమోహన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

