కల్వకుర్తి, ఏప్రిల్ 2 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గ్యాంగ్‌రేప్ కేసును పోలీసులు రెండ్రోజుల్లోనే ఛేదించారు. లైంగికదాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ, ఊర్కొండపేట గ్రామాలకు చెందిన నిందితులు మరుపాకుల ఆంజనేయులు, ఎండీ సాధిక్బా బా, వగుల్దాస్ మణి(అలియాస్ మణికంఠ), కార్తీక్, మట్ట మహేశ్‌గౌడ్, హరీశ్‌గౌడ్, మట్ట ఆంజనేయులును బుధవారం కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ఉంచారు.
మార్చి 29న దేవాలయానికి వచ్చిన ఓ మహిళపై వీరు అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిందితుల కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పట్టుకున్నట్టు ఆయన తెలిపారు.