Arrest | ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగను అపహరించే అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
Arrest | ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగితీగను దొంగిలించే అంతర్రాష్ట దొంగల(Interstate Thieves) ముఠాను రాచకొండ క్రైమ్ పోలీసులు(Racha konda Crime Police) పట్టుకున్నారు.
హైదరాబాద్ : ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగితీగను దొంగిలించే అంతర్రాష్ట దొంగల(Interstate Thieves) ముఠాను రాచకొండ క్రైమ్ పోలీసులు(Racha konda Crime Police) పట్టుకున్నారు. ఈ ముఠా ఏకంగా రాచకొండ, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట్ జిల్లాలోని 306 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో నుంచి రాగి వైర్‌ను తొలగించి విక్రయించుకున్నారు.
ఈ సందర్భంగా అంతరాష్ట్ర ఘరానా ముఠా వివరాలను శుక్రవారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్(achakonda Police Commissioner) డీఎస్ చౌహాన్ వెల్లడించారు. ఒడిస్సాకు చెందిన సహదేవ్ హజిరా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అభిమన్యు రాజ్బర్, నందులాల్ రాజ్బర్, రాహుల్ రాజ్బర్, రాంచందర్ అనే సభ్యులు రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసముంటూ చెడు అలవాట్లకు బానిసలై దొంగతనాలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్, వైర్(Copper coils, Wire) అపహరించి అమ్ముకోవాలని నిర్ణయించారు.
ఒకటి రెండు దొంగతనాలు చేయగానే, పల్సర్ బైక్, కార్‌ను కొనుగోలు చేసి అక్కడి నుంచి పక్కా ఫ్లాన్‌తో 175 ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల(Transformers) పై దాడులు చేశారు. ముందుగా పల్సర్‌పై తిరుగుతూ రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాయిల్స్, రాగి తీగలను ఇతర పరికరాలను అపహరించేవారని వెల్లడించారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసిన వాటిని రూ. 50 వేల నుంచి రూ. లక్షా వరకు సంపాదిస్తుందని పేర్కొన్నారు.
దొంగిలించిన సొమ్మును కొనేందుకు కుర్వ చిన్న నర్సింహులు, ఉత్తల్ మహేశ్, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన తులుగు రమణారెడ్డి, రంజాని యజశ్రీలతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. నిందితులు సహదేవ్ హజిర, అభిమన్యు రాజ్బర్, నందులాల్ రాజ్బర్లతో పాటు రీసీవర్స్ రమణారెడ్డి, జయశ్రీలను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. నిందితుల నుంచి 60 కిలోల రాగి కాయిల్స్, వైర్, రూ. లక్ష నగదు, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

