కొండాపూర్, సెప్టెంబర్ 8: హైదరాబాద్ ఐటీ కారిడార్లోని మై హోం భూజ గేటెడ్ కమ్యూనిటీలో వినాయక లడ్డూ వేలంలో రికార్డుస్థాయిలో రూ.20,50,000లకు మోతూరి సత్తిబాబు శ్రావణి దంపతులు సొంతం చేసుకున్నారు. గత ఏడాది వేలంలో ఇక్కడి లడ్డూ రూ.18.50 లక్షలు పలికింది. మెదక్ జిల్లా అమీన్పూర్ బీరంగూడ గుట్ట కమాన్ చౌరస్తాలో వినాయక లడ్డూను రామిరెడ్డి రూ.10.05 లక్షలకు దక్కించుకున్నారు.