మట్టెవాడ : గణపతి నవరాత్రి ఉత్సవాలను పురసరించుకొని వరంగల్ నగరంలోని పాపయ్యపేట కమాన్ గణపతి వద్ద పెట్టిన భారీ లడ్డూ రికార్డు సృష్టించింది. 2100 కిలోల లడ్డూ ప్రసాదాన్ని డోసైల్ డెలివరీ సర్వీసెస్ వారు సమర్పించారు. నిమజ్జనం రోజు తమ కంపెనీ యాప్ డౌన్లోడ్ ద్వారా బుక్ చేసుకున్న భక్తుల ఇంటికి వెళ్లి ఫ్రీగా లడ్డూ ప్రసాదాన్ని ఇస్తామని చెప్పారు.
మహదేవపూర్, సెప్టెంబర్ 11: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బరాజ్‌లో ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు బుధవారం వరద ప్రవాహ అంచనా పరీక్షలు మొదలయ్యాయి. పుణెకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ సంపత్, నాగరాజు ఆధ్వర్యంలో ఏడీసీపీ (అకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫెల్లర్) పరికరాన్ని బోటుకు అమర్చి బరాజ్‌లోని అప్స్టీమ్లో భారీ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి వరద ప్రవాహం అంచనా కోసం పరీక్షలు చేపట్టారు. బరాజ్ వద్ద వరద ప్రవాహం మంగళవారం 4,06,510 క్యూసెక్యులు ఉండగా, బుధవారం 3,62,690 క్యూసెక్యులకు పెరిగింది. వరద ప్రవాహాన్ని నిపుణుల బృందం పరీక్షించింది. రిపోర్ట్‌ను పుణేలోని పీడబ్ల్యూపీఆర్సీకి అందజేయనున్నారు.