గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత విద్యుత్ పథకానికి నిధులు విడుదల చేయండి
ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రజక, నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 250 యూనిట్ల ఉచిత్ విద్యుత్ పథకానికి సంబంధించిన రూ.140 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో విద్యుత్ అధికారులు ల్యాండ్రీ, సెలూన్ నిర్వాహకులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌కు సంబంధించిన నూతన కనెక్షన్లను ఇవ్వాలని కోరారు.