‘ప్రశ్నించే తత్వం, పోరాటస్ఫూర్తి మా నాన్న మాకిచ్చిన అస్తులు’ అని గద్దర్ కుమార్తె వెన్నెల అన్నారు. సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ సంస్మరణ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వెన్నెల మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని దారబోసిన గొప్ప మహనీయుడు గద్దర్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూ గద్దర్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తానని ఆమె తెలిపారు. -తూప్రాన్