హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి వీ వెన్నెలను నియమిస్తూ యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని నాలుగు జిల్లా గ్రంథాలయ సంస్థలకు ప్రభుత్వం కొత్త చైర్మన్లను నియమించింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం జీవోలను జారీచేశారు. జనగాం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎం రాంబాబు, యాదాద్రి భువనగిరికి ఎండీ అవాజ్ ఉర్ రెహ్మన్, హనుమకొండకు మహ్మద్ అజీజ్‌ఖాన్, మేడ్చల్ మల్కాజిగిరికి బొంగునూరి శ్రీనివాస్‌రెడ్డిని చైర్మన్లుగా నియమించారు.