హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయింపు కేసులో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ తరఫున పిటిషన్ వే సిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. స్పీకర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ముందు ఆయన వాదనలను వినిపించా రు. కడియం తరఫు లాయర్లు వివేకానంద ను ప్రశ్నించారు. కడియం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారనేందుకు వివేకానంద సమర్పించిన వీడియోలు, పత్రికల క్లిప్పింగ్‌లు, సోషల్ మీడియా పో స్టులపై ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. విచారణ ప్రక్రియను ట్రిబ్యునల్ రికార్డు చేసుకున్నది. తదుపరి ప్రక్రియలో పిటిషనర్ వివేకానందగౌడ్ తరఫు న్యాయవాదులు కడి యం శ్రీహరిని ప్రశ్నిస్తారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసులో పిటిషనర్ హు జూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని దానం న్యాయవాదులు బుధవా రం ప్రశ్నించారు. మళ్లీ కౌశిక్‌రెడ్డి తరఫు లా యర్లు దానంను ప్రశ్నించనున్నారు. ఇరువర్గాల వాదనలు పూర్తయిన తర్వాత స్పీకర్ తుదినిర్ణయం ప్రకటిస్తారు. కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లో చేరారని, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున పలువు రు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదుచేశారు. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ), ఎం సంజయ్‌కుమార్ (జగిత్యాల), కాలే యాదయ్య(చేవెళ్ల), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), ప్ర కాశ్గౌడ్ (రాజేంద్రనగర్), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్చెరు), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)కి క్లీన్చిట్ లభించింది. మిగిలిన ఇద్దరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మె ల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ల కేసులో వాదనలు కొనసాగుతున్నాయి.