మంచిర్యాల, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా మంచిర్యాల జిల్లా కోటపల్లి ఎంపీఈవో కార్యాలయంలో కేంద్రమాజీ మంత్రి వెంకటస్వామి జయంతిని ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఎంపీడీవో కార్యాలయాన్ని పార్టీ ఆఫీస్‌ను తలపించేలా అలంకరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించ వద్దని కలెక్టర్ స్పష్టంగా చెప్పినా, పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు ఎంపీడీవో కార్యాలయ ద్వారానికి ఫ్లెక్సీ కట్టి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.