హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో యువతకు సీఎం కేసీఆర్ అద్భుత అవకాశాలు కల్పిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర కొనియాడారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మేడే రాజీవ్సాగర్కు శుక్రవారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంకితభావంతో పనిచేసిన యువతకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా సీఎం కేసీఆర్ అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా రాజీవ్సాగర్ను నియమించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.