మారుతీనగర్, సెప్టెంబర్ 23 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఖరి మజిలీ కోసం వైకుంఠధామాలను సకల సౌకర్యాలతో నిర్మించగా, ప్రస్తుత
చిమ్మ చీకట్లో అంత్యక్రియలు ప్రభుత్వ హయాంలో విద్యుత్తు, నీటి సరఫరా లేక చెత్తా చెదారంతో దర్శనమిస్తున్నాయి. మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో న్యూబోయవాడకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా అంత్యక్రియల కోసం న్యూబోయవాడ శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ విద్యుత్తు సరఫరా లేకపోవడంతో కారు చీకట్లో సెల్‌ఫోన్ లైట్లతో అంత్యక్రియలు చెయ్యాల్సిన దుస్థితి నెలకొంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్మశానవాటికకు దారిపొడవునా వీధి దీపాలను ఏర్పాటు చేయడమే కాకుండా వైకుంఠధామంలో హైమాస్ లైట్‌ను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణలో విఫలమైందని అంతిమయాత్రలో పాల్గొన్న మిత్రులు, బంధువులు, ప్రజలు వాపోయారు.