హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): వ్యాయామం, ఆరోగ్యానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే టీ-హబ్ స్టార్టప్ పోర్టల్‌కు సిరీస్ ‘ఏ’ ఫండింగ్‌లో భాగంగా ఒకేసారి 3 మిలియన్ డాలర్లు (రూ.24 కోట్లు) సమకూరాయి. భారత్ ఇన్నోవేషన్ ఫండ్ నిధులను పోర్టల్ స్టార్టప్ కంపెనీ తన వ్యాపార కార్యకలాపాల విస్తరణ, మరిన్నీ నూతన ఆవిష్కరణలకు ఉపయోగించనుంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ సేవలు అందిస్తున్నది.