నాగర్‌కర్నూల్ : జిల్లాలోని మామిడి రైతుల చిరకాల వాంచ నెరవేరనున్నది. దశాబ్దాల కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసింది. కొల్లాపూర్ మామిడికి దేశంలో మంచి పేరుంది. దేశవాలి రకానికి పెట్టింది పేరు. రుచి, తీపి, నాణ్యతలోను ఇక్కడ మామిడి పండ్లకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇంతటి ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతంలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని రైతులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. వారి కలలు ఫలించాయి. మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది.
దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డికి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.