హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లో టీచర్ల హాజరు నమోదుకు అమలుచేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానం శనివారం రెండోరోజుకే తగ్గిపోయింది. 82శాతం హాజరు మాత్రమే నమోదైంది. మొదటి రోజున 93% హాజరు నమోదు కాగా, రెండో రోజుకే అది 82శాతానికి తగ్గిపోయింది. ఇప్పటివరకు ఎఫ్ఆర్ఎస్ యాప్లో మొత్తంగా 89.59% పేర్లు నమోదు చేసుకున్నారు.
‘ఆ నలుగురి కోసమే సోలార్ నిబంధనలు’
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఓ నాలుగు బడా సంస్థల కోసమే సోలార్ టెండర్ల నిబంధనలు పొందుపరిచారని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ నేతలు ఆరోపించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారి కోస ం.. తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని నేతలు వాపోయారు. ఎంఎస్ఎంఈ పాలసీ ప్రకారం స్థానికులకు 30% పనులు ఇవ్వాల్సి ఉండగా, పాటించడంలేదని మండిపడ్డారు. ఓ నాలుగు బడా సంస్థలకు టెండర్లను కట్టబెట్టేందుకు నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఇదే విషయంపై టీజీ రెడ్కో వీసీ అండ్ ఎండీ అనిలతో సోలార్ ఇంటిగ్రేటర్లు శనివారం వాగ్వాదానికి దిగారు. కోర్టును ఆశ్రయిస్తామని నేతలు వెల్లడించారు.