హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలోని ప్రధాన వర్సిటీల్లో కొత్త వీసీల పేర్లను ఖరారు చేసేందుకు సెర్చ్ కమిటీ సమావేశాలు షురూ కావడంతో ఆ పోస్టులెవరిని వరిస్తాయోనన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. బుధవారం తెలంగాణ వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గురువారం పాలమూరు, ఉస్మానియా, బీఆర్‌ఏవోయూ, తెలంగాణ వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం శాతవాహన, కాకతీయ, జేఎన్టీయూ సెర్చ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.
సచివాలయంలోని సీఎస్ చాంబర్లో సమావేశాలు జరగనుండగా, ప్రభుత్వవర్గాలు అత్యంత గోప్యతను పాటిస్తున్నాయి. రాష్ట్రంలోని 10 వర్సిటీల వీసీల పదవీకాలం మే 21 తో ముగిసింది. ప్రస్తుతం ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. పది వర్సిటీలున్నా ప్రధానం గా ఉస్మానియా, జేఎన్టీయూ వీసీ పోస్టులపైనే అత్యధికులు గురిపెట్టారు. కీలకమైన జేఎన్టీ యూ వీసీ పోస్టుకు ఉత్తరాదిలోని ఓ ఎన్ఐటీకి చెందిన ప్రొఫెసర్ ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఓసీ సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ సీఎం ఆశీస్సులతో ఓయూ వీసీ పోస్టుకు పోటీపడుతున్నారు.
ఓ యువ ఎమ్మె ల్సీ సైతం తనకు కావాల్సిన వారికి ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి తనకు సన్నిహిత ప్రొఫెసర్‌కు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కే యూకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ తన నియోజకవవర్గం మంత్రి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నా రు. ఏపీలోని ఓ ప్రైవేట్ వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. మైనార్టీ వర్గానికి చెందిన మరో ప్రొఫెసర్ కామారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేతతోపాటు ఎంఐఎం కీలక నేత ల ఆశీస్సులు కోరినట్టు తెలుస్తున్నది. పలువురు ప్రొఫెసర్లు సామాజిక అస్ర్తాన్ని వాడుతున్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.