హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాడల్ స్కూళ్ల టీచర్లు ఈనెల 24నుంచి 29వరకు దశల వారీ గా ఆందోళనలకు పిలుపునిచ్చారు. 29న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ నేతలు యాకమల్లు, నగేశ్ తెలిపారు.