హైదరాబాద్, మార్చి 4: ఫ్రీడం పేరుతో వంటనూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడబుల్స్ అండ్ ఫాట్స్ ఇండియా..కోయంబత్తూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్ సంస్థలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. మసాలా, మీల్స్ మిక్స్లతోపాటు ఇతర ఉత్పత్తుల సంస్థ శ్రీ అన్నపూర్ణలో 70 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు జెమినీ ఎడబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా జీఈఎఫ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను నెలకొల్పింది. జాయింట్ వెంచర్లో ఏర్పాటైన ఈ సంస్థతో ఇరు కంపెనీలకు ప్రయోజనం కలగనున్నదన్నారు.