Free Transportation | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ) : నూతన సంవత్సరం సందర్భంగా నేటి రాత్రి హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్టు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 500 కార్లు, 250 బైక్‌లు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. వాహనదారులు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
యూకే, సౌదీలో ‘డాక్టర్’కు దరఖాస్తులు
హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ) : యూకే, సౌదీలో డాక్టర్ ఉద్యోగాల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ దరఖాస్తులు ఆహ్వానించింది. యూకేలో వైద్యులకు ఎంబీబీఎస్ లేక తత్సమాన వైద్య అర్హతతోపాటు అక్కడ ప్రాక్టీస్ చేసేందుకు లైసెన్స్, జీఎంసీ నమోదు తప్పనిసరి. కన్సల్టెంట్ డాక్టర్‌కు సంవత్సరానికి రూ. 1.1 కోట్ల నుంచి 1.5కోట్ల వేతనం ఇస్తారు. సౌదీ అరేబియాలో స్పెషలిస్టు, కన్సల్టెంట్ ఫిజీషియన్ల నియామకం చేపడుతున్నారు. స్పెషలిస్టులకు నెలకు రూ. 5.11లక్షలు, కన్సల్టెంట్లకు నెలకు రూ. 11-18లక్షల వేతనం ఇస్తారు. ఇంటర్యూల కోసం నమోదు చేసుకునేందుకు tomcomglobal @ gmail.comకి మెయిల్ చేయవచ్చు.