హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మి గురువారం తెలిపారు.
8వ తరగతి పాస్, ఐటీఐ/డిప్లొమా అర్హత గల అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వివరాలకు 9133908000, 9133908111 నంబర్లలో సంప్రదించాలని కోరారు.