తొర్రూరు, ఆగస్టు 11: మహిళలు ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా ఉచిత కుట్టు శిక్షణ శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను శుక్రవారం సందర్శించి, శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, ఉచితంగా కుట్టు మెషీన్ల పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వరంగల్ టెక్స్టైల్ పారులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్ ఏర్పాటు చేస్తున్నామని, దీంతో స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని తెలిపారు.