హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఎంసెట్, నీట్, ఐఐటీ జేఈఈ, సీఏ సీపీటీ-2022 పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచితంగా స్వల్పకాలిక ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ తెలిపారు.
ఔత్సాహికులు తమ హాల్‌టికెట్ నంబర్‌తో www.tscie.rankr.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు. హాల్‌టికెట్ నంబరు, పాస్వర్డ్ ఒకటేనని చెప్పారు. ‘డిపార్టుమెంట్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఈ-లెర్నింగ్ తెలంగాణ’ యూట్యూబ్ చానల్ ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు.