హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 11వేలకు పైగా సర్కారు బడులకు పాఠశాల విద్యాశాఖ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నది. బీఎస్ఎన్ఎల్ ద్వారా బడులకు కనెక్షన్ ఇవ్వనున్నారు. ఏఎక్స్ఎల్ ప్రోగ్రామ్ అమలుచేస్తున్న 5,342 బడులు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్న 5,992 బడులకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ను సమకూర్చనున్నది. ఈ కనెక్షన్ల జారీకి సంబంధించిన ప్రగతిని ప్రతి శనివారం తమకు తెలియజేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ బీఎస్ఎన్ఎల్ అధికారులకు లేఖ రాశారు.
15 నుంచి యాక్టివ్ సీఐఎస్సీఈ
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, ఫిట్నెస్ పెంచే లక్ష్యంతో ఈ నెల 15 నుంచి యాక్టివ్ సీఐఎస్సీఈని అమలుచేయనున్నట్టు రీజినల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ ఎస్ థెరిసా తెలిపారు. ప్రత్యేక ఫిజికల్ ఫిట్నెస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఫిట్నెస్ స్కోర్ ఆధారంగా రిపోర్ట్కార్డులను జారీచేస్తామని పేర్కొన్నారు. డిజిటల్ స్క్రీన్స్, సెల్ఫోన్ గేమింగ్ బారినపడిన వారిని దూరం చేసి, క్రమశిక్షణ, మానసిక శ్రేయస్సు, ఫిజికల్ ఫిట్నెస్ లక్ష్యం కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.