హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టి నాలుగేండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా గురువారం బస్‌భవన్‌లో ఆయనను సన్మానించారు. ఆర్టీసీలో ఆయన ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలను అధికారులు గుర్తుచేసుకున్నారు.